اقلیتی طلبہ کے لیے تعلیمی امدادی پروگرام میں توسیع
నెల్లూరు, జూన్ 22: నెల్లూరు నగరంలోని హరనాధపురం లో గల ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ నివాసంలో ఆయనను ముస్లిం మైనారిటీ నాయకులు సమీ హుస్సేనీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. స్థానిక జెండా వీధి నుంచి బైక్ ర్యాలీగా వచ్చి సేరా తొడిగించి అజీజ్ ను ఘనంగా సన్మానించుకున్నారు. అనంతరం దువా చేసి, కేక్ కటింగ్ నిర్వహించారు.
Awaztv.in
సీనియర్ లీగల్ సెల్ నాయకులు నన్నే సాహెబ్ 20 వేల రూపాయలు, నెల్లూరు పార్లమెంటు లీగల్ సెల్ అధ్యక్షులు రియాజ్ భాష 20 వేల రూపాయలు చెక్కులను తాలీం ఏ హునర్ కు విరాళంగా అందించారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో తాలిం ఏ హునర్ కార్యక్రమం నిర్వహించారని కొనియాడారు. ఈ సందర్భంగా సమీ హుస్సేనీ మాట్లాడుతూ, ధనవంతులు బిడ్డలు ఎక్కడ చదువుతున్నారో పేద విద్యార్థులను కూడా అక్కడే చదివిస్తున్నారని అన్నారు. పేద విద్యార్థుల జీవితాలను ఉన్నతంగా మార్చి వారిని దేశానికి వెన్నెముకల తయారు చేస్తున్న అబ్దుల్ అజీజ్ కు నా సలాములు అన్నారు. సాబీర్ ఖాన్ మాట్లాడుతూ దేశంలో అత్యున్నత పోటీ పరీక్షలకు పోటీపడేలా ఈ విద్యార్థులను తయారు చేస్తున్నారని అన్నారు. అబ్దుల్ అజీస్ ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో మార్క్ లు సృష్టించారని, ఆ మార్క్ లను మార్చాలంటే మరో అబ్దుల్ అజీజ్ ఏ రావాలని అన్నారు. హయత్ బాబా మాట్లాడుతూ అబ్దుల్ అజీజ్ చేయగలిగిందే చెప్పారని చెప్పింది తూచా తప్పకుండా చేసి చరిత్ర సృష్టించారని అన్నారు. వక్ఫ్ బోర్డు బాధ్యతలు ఇలా కూడా నిర్వర్తించవచ్చని నిరూపించి, దేశవ్యాప్తంగా ఉన్న చైర్మన్ లకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. శంషుద్దీన్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించిన సంఘటన తాలీం ఏ హునర్ అని కొనియాడారు. దేశంలో డబ్బు వల్ల గొప్పవారైన వ్యక్తులు అతి తక్కువ మందిని కేవలం విద్య వల్లే అనేకమంది గొప్పవారయ్యారని అన్నారు. ఒక విద్యావంతుడు పదవి అధిరోహిస్తే ఎలా ఉంటుంది అనడానికి అబ్దుల్ అజీజ్ నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో ఖాజావలి, ఇంతియాజ్, అన్వర్, ఇక్బాల్, పాషా మొహిద్దిన్, ఖాదర్ బాషా, జుబేర్, మైజుల్లా హుసేని తదితరులు పాల్గొన్నారు.
మా లక్ష్యం
ముస్లిం మైనారిటీ సమాజానికి సంబంధించిన నిజమైన వార్తలు, ఉపయోగకరమైన సమాచారం, సంక్షేమ పథకాలు, విద్యా అవకాశాలు మరియు సామాజిక అవగాహనను ప్రజలకు చేరవేయడం.
మా విజన్
విద్యావంతమైన, అవగాహన కలిగిన, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే ముస్లిం మైనారిటీ సమాజ నిర్మాణానికి మీడియా ద్వారా తోడ్పడడం.
మా నినాదం
“ఆవాజ్ టీవీ – మైనారిటీ సమాజం యొక్క నిజమైన స్వరం”
లేదా
“ఆవాజ్ టీవీ – మన హక్కులు, మన అభివృద్ధి, మన స్వరం”




