కర్నూలు, జూన్ 30: కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేస్తున్న సర్ ప్రక్రియ నిర్ణీత గడువును పొడిగించాలనికోరుతూ కర్నూల్ నగరంలో మంగళవారం AwaazTv ఛానల్ సిఎండి డాక్టర్ షేక్ మహబూబ్ బాషా నేతృత్వంలో ముస్లిం మైనారిటీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణము నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి కి మెమోరాండం అందజేశారు
Awaztv.in
ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్ ప్రక్రియ నమోదు తేదీని పొడిగించాలని కోరారు. పేద, నిరక్షరాస్య ప్రజలకు సర్ పై సమగ్ర అవగాహన కల్పించాలని, అవసరమైన డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఓటు నమోదు చేసుకోవడం ప్రతి ఒక్కరి హక్కు అని, ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైంది అన్నారు. మెమోరాండం అందుకున్న కలెక్టర్ డాక్టర్ సిరి ప్రభుత్వ ఉన్నత అధికారులకు తెలియజేస్తాన ని తెలిపారు. ర్యాలీ, మెమోరాండం అందజేసిన కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు తాటిపాడు మహబూబ్ సాహెబ్, ముఫతి అబ్దుల్ రహమాన్, రిటైర్డ్ తాసిల్దార్ రోషన్ అలీ, ఎస్ డి పి ఐ నాయకులు జహంగీర్, టైలర్ అసోసియేషన్ నాయకులు సైఫుల్ల, షోయబుద్దిన్ ఖాదిరి, పీఠాధిపతి సయ్యద్ ముర్తుజా ఖాదిరి, నగర ముస్లిం మైనారిటీ నేత షేక్ మొహమ్మద్ గౌస్, నగర కాంగ్రెస్ నాయకులు నవీద్, ఆర్టిఐ నాయకులు సలీం, సంస్థ సీఈవో బ్రహ్మానందరావు, సంస్థ ప్రతినిధులు మహబూబ్ షరీఫ్, కరీం,తదితరులు పాల్గొన్నారు.
మా లక్ష్యం
ముస్లిం మైనారిటీ సమాజానికి సంబంధించిన నిజమైన వార్తలు, ఉపయోగకరమైన సమాచారం, సంక్షేమ పథకాలు, విద్యా అవకాశాలు మరియు సామాజిక అవగాహనను ప్రజలకు చేరవేయడం.
మా విజన్
విద్యావంతమైన, అవగాహన కలిగిన, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే ముస్లిం మైనారిటీ సమాజ నిర్మాణానికి మీడియా ద్వారా తోడ్పడడం.
మా నినాదం
“ఆవాజ్ టీవీ – మైనారిటీ సమాజం యొక్క నిజమైన స్వరం”
లేదా
“ఆవాజ్ టీవీ – మన హక్కులు, మన అభివృద్ధి, మన స్వరం”




