HomeBusinessమీడియా అధినేత డాక్టర్ షేక్ మహబూబ్ బాషా సేవలు అభినందనీయం… మాజీమంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు...

మీడియా అధినేత డాక్టర్ షేక్ మహబూబ్ బాషా సేవలు అభినందనీయం… మాజీమంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్

اقلیتی طلبہ کے لیے تعلیمی امدادی پروگرام میں توسیع

కర్నూలు, జూన్ 29: రాయలసీమ ముఖద్వారం అయిన కర్నూల్ నగరం ప్రధాన కేంద్రంగా మన తెలుగు టీవీ, వన్ టీవీ, awaz టీవీ చానల్స్, ఆంధ్ర అక్షర పత్రిక ద్వారా సేవలు అందిస్తున్న మీడియా అధినేత డాక్టర్ షేక్ మహబూబ్ బాషా ను మాజీ రాష్ట్ర మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు, బిజెపి జాతీయ నాయకులు టీజీ వెంకటేష్ అభినందించారు.. సోమవారం ఆయన awaz మీడియా కార్యాలయాన్ని సందర్శించారు

Awaztv.in

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుంచి అప్రతిహతంగా, ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా, సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా గళాన్ని వినిపిస్తున్న డాక్టర్ షేక్ మహబూబ్ బాషా కృషిని ఆయన కొనియాడారు. తనకు ఆత్మీయుడు, సేవా దృక్పథం కలిగిన డాక్టర్ షేక్ మహబూబ్ బాషా చేపట్టే ప్రతి కార్యక్రమంలో తాను భాగస్వామ్యం కావడం ఆనందం కలిగిస్తుంది అన్నారు. భవిష్యత్తులో పేద ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిలో మీడియా ద్వారా డాక్టర్ షేక్ మహబూబ్ బాషా సేవలందిస్తూ ప్రజా జీవితంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా మీడియా నిర్వహణ డాక్టర్ షేక్ మహబూబాషా కే సాధ్యమన్నారు. నూతనంగా ప్రారంభించినAwaztv ఛానల్ ద్వారా భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మీడియా అధినేత సీఎం డి డాక్టర్ షేక్ మహబూబ్ బాషా, మాజీ మంత్రి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ను ఘనంగా సత్కరించి మెమొంటో అందజేశారు.. కార్యక్రమంలో సంస్థ సీఈవో బ్రహ్మానందరావు, మీడియా సిబ్బంది, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
..

మా లక్ష్యం

ముస్లిం మైనారిటీ సమాజానికి సంబంధించిన నిజమైన వార్తలు, ఉపయోగకరమైన సమాచారం, సంక్షేమ పథకాలు, విద్యా అవకాశాలు మరియు సామాజిక అవగాహనను ప్రజలకు చేరవేయడం.

మా విజన్

విద్యావంతమైన, అవగాహన కలిగిన, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే ముస్లిం మైనారిటీ సమాజ నిర్మాణానికి మీడియా ద్వారా తోడ్పడడం.

మా నినాదం

“ఆవాజ్ టీవీ – మైనారిటీ సమాజం యొక్క నిజమైన స్వరం”

లేదా

“ఆవాజ్ టీవీ – మన హక్కులు, మన అభివృద్ధి, మన స్వరం”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Recent Comments

Most Popular

Follow Us