اقلیتی طلبہ کے لیے تعلیمی امدادی پروگرام میں توسیع
నెల్లూరు, జూన్ 29:ప్రపంచ పండుగలలో,ముఖ్యమైన బారాషహీద్ దర్గా రొట్టెల పండుగలో ముఖ్యమైన వేడుక గంధ మహోత్సవం శనివారం అర్ధరాత్రి వైభవంగా జరిగింది
Awaztv.in
స్థానిక కోటమిట్టలోని, కడప అమీన్ పీర్ దర్గా వారి ఆధీనంలోని మసీదులో మత పెద్దలు ప్రార్థనలు చేసి 12 బిందెల్లో సుగంధ ద్రవ్యాలతో గంధమును కలిపారు. గంధం తో నిండిన బిందెలను పూలతో అలంకరించి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై పెట్టుకుని, ఫకీర్ల మేళతాళాలు, ఆటపాటలతో స్థానిక కళాకారుల డప్పులతో, తాశాలతో కూడిన భక్త బృందం, కోటమిట్ట, పెద్ద బజారు పాత జడ్పీ ఆఫీస్, స్థానిక కూరగాయల మార్కెట్, కెవిఆర్ పెట్రోల్ బంకులు మీదుగా దర్గా మైదానంలోని మసీదుకు మొదటగా చేరడం జరిగినది. అక్కడ అమరులై కొలువుతీరి ఉన్న బారాషహీద్ల గురించి ముజావర్లు కీర్తిస్తూ ప్రార్థనలు చేయగా ఫకీర్లు సాహస విన్యాసాలు చేశారు. .
మా లక్ష్యం
ముస్లిం మైనారిటీ సమాజానికి సంబంధించిన నిజమైన వార్తలు, ఉపయోగకరమైన సమాచారం, సంక్షేమ పథకాలు, విద్యా అవకాశాలు మరియు సామాజిక అవగాహనను ప్రజలకు చేరవేయడం.
మా విజన్
విద్యావంతమైన, అవగాహన కలిగిన, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే ముస్లిం మైనారిటీ సమాజ నిర్మాణానికి మీడియా ద్వారా తోడ్పడడం.
మా నినాదం
“ఆవాజ్ టీవీ – మైనారిటీ సమాజం యొక్క నిజమైన స్వరం”
లేదా
“ఆవాజ్ టీవీ – మన హక్కులు, మన అభివృద్ధి, మన స్వరం”




